భారతదేశం, ఆగస్టు 5 -- పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కలపడం మంచిది కాదు అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇథనాల్ కారణంగా వాహనం దెబ్బతింటుందని ప్రచారం జరిగింది. దీనిపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. ప్రతికూల ప్రభావం, ముఖ్యంగా పాత వాహనాలు, డ్రైవింగ్ అనుభవం ప్రభావం ఉంటుందని మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.

ఆ ప్రచారం అంతా నిరాధారమైనదని, శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ వివరణాత్మక స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో ఎలాంటి ఇంధన సమస్యలు రాదని క్లారిటీ ఇచ్చింది. ఇథనాల్ కారణంగా కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడనున్నట్టుగా వెల్లడించింది. పెట్రోల్‌తో పోలిస్తే.. ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుందని, ఈ కారణంగా మైలేజీలో స్వల్ప...