భారతదేశం, నవంబర్ 13 -- విశాఖలో నవంబర్ 14, 15వ తేదీల్లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖ వచ్చారు. నోవాటెల్‌లో నిర్వహించిన ఇండియా-యూరప్‌ బిజినెస్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్లోబల్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వడానికి ఏపీ గేట్ వే అవుతుందని చంద్రబాబు చెప్పారు.

కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేయడం వలన సౌలభ్యం, వేగం, ఖర్చు కలిసి వస్తుందని చెప్పారు. 'వివిధ రంగాలలో అపారమైన అవకాశాలతో ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రవేశ ద్వారంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రోత్సాహకాలు, వేగవంత...