భారతదేశం, నవంబర్ 14 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందకు ఇదే సరైన సమయమని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు విజయవంతం కావాలని... పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు. విశాఖపట్నంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న 30 సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ సహా వివిధ మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అలాగే ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రాగంణానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప రాష్ట్రపతిని అల్పాహార విందుకు ఆహ్వానించారు.

సభా ప్రాంగణంలోని ప్లీనరీ హాల్లో నిర్వహించిన భ...