భారతదేశం, నవంబర్ 17 -- హైదరాబాద్‌, నవంబర్‌ 17: డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో... పెట్టుబడి పెట్టే స్తోమత లేనివారు సైతం వ్యాపారంలో అడుగు పెట్టవచ్చు. సరుకులను నిల్వ చేయాల్సిన అవసరం లేదు. పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేయవచ్చని చెబుతోంది హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డబ్ల్యుకామర్స్‌.

చిరు వ్యాపారులు, వ్యక్తులు ఎవరైనా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వ్యాపారం ప్రారంభించవచ్చు.

ఆన్‌లైన్ స్టోర్ క్రియేషన్: విక్రేతల పేరుతో కంపెనీ ఒక ప్రత్యేక ఆన్‌లైన్‌ స్టోర్‌ను క్రియేట్ చేస్తుంది.

ప్రమోషన్ సులువు: విక్రేత చేయాల్సిందల్లా... తమ ఆన్‌లైన్‌ స్టోర్‌కు సంబంధించిన లింక్‌/క్యూఆర్‌ కోడ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం లేదా బంధువులు, స్నేహితులకు షేర్ చేయడం.

డెలివరీ, లాభం: ...