Hyderabad, ఆగస్టు 17 -- తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో యువకుడు మణికాంత్. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మణికాంత్ డెబ్యూ చేస్తున్న సినిమా ఫైటర్ శివ. ఈ చిత్రంలో కమెడియన్ సునీల్, సినిమా బండి ఫేమ్ వికాస్ వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఐరా బన్సాల్ హీరోయిన్‌గా చేస్తున్న ఫైటర్ శివ సినిమాకు ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించారు. తాజాగా నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా ఫైటర్ శివ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫైటర్ శివ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో యంగ్ హీరో మణికాంత్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీరో మణికాంత్ మాట్లాడుతూ .. "నన్ను హీరోని చేయాలని ఈ 'ఫైటర్ శివ' కోసం మా నాన్న గారు చాలా కష్టపడ్డారు. పెట్టిన ప్రతీ రూపాయిని వడ్డీతో సహా ఇండస్ట్రీ నుంచి తీసుకు వెళ్తాను. ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. మధ్యలో ...