భారతదేశం, జూన్ 28 -- ఒక యువతి తన పెంపుడు కుక్కను గొంతు కోసి బలి ఇచ్చిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. అనంతరం, ఆ కుక్క మృతదేహాన్ని తన ఫ్లాట్ లోనే దాచి పెట్టింది. ఫ్లాట్ లో నుంచి దారుణమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన అపార్ట్మెంట్ వాసులు. ఫ్లాట్ లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు.

పశ్చిమబెంగాల్ కు చెందిన త్రిపర్ణా పైక్ అనే ఓ మహిళ తన పెంపుడు కుక్క లాబ్రడార్ ను గొంతు నులిమి చంపి దాని కుళ్లిపోయిన శవాన్ని చాలా రోజుల పాటు బెంగళూరులోని తన అపార్ట్ మెంట్ లో ఉంచింది. నిందితురాలు త్రిపర్ణా పైక్ తన మూడు లాబ్రడార్ కుక్కలలో ఒకదాని గొంతు కోసి, ఆపై మృతదేహాన్ని మహదేవపురలోని తన అపార్ట్మెంట్లో గుడ్డలో చుట్టి పెట్టింది. కుళ్లిపోయిన కుక్క నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారి దృష్టికి రావడంతో వారు బెంగళూరు నగరపాలక సంస్థ (బీబీఎం...