భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలోని పలు కాలేజీలు పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే బంద్ కు కూడా పిలుపునివ్వగా. ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో ఆయా కాలేజీలు వెనక్కి తగ్గాయి. చర్చల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

2813 జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 161 కోట్లు వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలను జారీ చేశారు. ఆయా నిధులను వెంటనే విడుదల చేయాలని సూచించారు.

గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నామని భట్టి విక్రమార్క ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, కళాశాలలకు అవసరమైన నిధులు నిరంతరాయంగా చేరేలా ప్రజా ప్రభుత్వం కృషి ...