భారతదేశం, జనవరి 20 -- తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌరులను ఆపి బలవంతంగా ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని అడగొద్దని స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు బలవంతపెట్టొద్దని తెలిపింది. 'ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలనుకునే ఏ పౌరుడైనా తమకు నచ్చిన విధంగా చెల్లించవచ్చు. పోలీసులు చర్యలు తీసుకోవాలనుకుంటే వారికి నోటీసులు జారీ చేయాలి. తగిన ప్రక్రియను ఫాలో కావాలి. పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించాలని, పోలీసులు వాహన కీలను లాక్కోవడం, మరే ఇతర బలవంతపు చర్యలు చేయకూడదు.' అని హైకోర్టు పేర్కొంది.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను అమలు చేయడానికి ఉపయోగించే పద్ధతులను సవాలు చేస్తూ సికింద్రాబాద్ నివాసి వి. రాఘవేంద్ర చారి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణ చేసింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్ల...