భారతదేశం, అక్టోబర్ 30 -- తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న విదేశీ స్కాలర్‌షిప్ బకాయిల కోసం రూ.303 కోట్లు విడుదల చేసింది. 2022 నుండి అన్ని బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసిందని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

'పెరుగుతున్న జీవన వ్యయాలు, విదేశాలలో కొత్త ఆంక్షలు, పెరుగుతున్న విద్యా ఖర్చులు వేలాది కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులను కలిగించాయి. ప్రతి విద్యార్థికి సుమారు రూ. 20 లక్షల సకాలంలో సహాయం అందించడం చాలా అవసరమైన ఉపశమనం, ఆశను తెస్తుంది.' అని మల్లు భట్టి విక్రమార్క ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా తెలంగాణలోని ప్రైవేట్ కళాశాలలు ఇప్పటికీ రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (TFHEI) ఛైర్మన్ రమేష్ బాబు ఇటీవల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ...