భారతదేశం, ఆగస్టు 22 -- న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రికి వినతి పత్రం సమర్పించారు. అంతేకాకుండా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA స్పర్శ్) ప్రోత్సాహక పథకం కింద రూ. 250 కోట్లు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని కూడా మెమొరాండంలో కోరారు. ఇప్పటివరకు 'స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వ...