భారతదేశం, డిసెంబర్ 25 -- రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ గా తెరకెక్కుతోంది. అంటే వివిధ కాలాల్లో, వివిధ ఖండాల్లో జరిగే కథగా వారణాసిని రెడీ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో హీరో అయిన మహేష్ బాబు కొత్త లుక్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

వారణాసి కోసం మహేష్ బాబు ఇన్ని రోజులు జులపాల జుట్టు, గడ్డంతో కనిపించారు. మూడు రోజుల కింద ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో ఆయన ఈ లుక్ తో ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడేమో సడెన్ గా గడ్డం తీసేసి, పూర్తి క్లీన్ షేవ్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేష్. క్రిస్మస్ సందర్భంగా తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి మహేష్ దిగిన ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేష్ క్లీన్ షేవ్ తో కనిపించారు.

వారణాసి సిని...