భారతదేశం, అక్టోబర్ 27 -- బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా విమానాశ్రయం తన సేవలను కొత్త విమానాశ్రయాలకు విస్తరించింది. దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలతో ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసకున్నట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్ నగరానికి పూర్ణియా నుంచి నేరుగా కొత్త సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని, ఐటీ నగరానికి నేరుగా ప్రయాణించే అవకాశాలు పెరిగాయని ప్రయాణికులు సంతోషంగా ఉన్నారు. ప్రత్యక్ష కనెక్టివిటీ ప్రయాణ ఖర్చులను తగ్గించదు.. కానీ సమయాన్ని ఆదా చేస్తుంది.

పూర్ణియా విమానాశ్రయ డైరెక్టర్ డీపీ గుప్తా మాట్లాడుతూ.. ఆదివారం నాడు విమానం తొలిసారిగా పూర్ణియా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దిల్లీ నుండి బయలుదేరిన విమానంలోని...