Hyderabad, జూలై 10 -- అర్జునుడికి రథసారథిగా ముక్తిసాధనమైన గీతామృతాన్ని ఉపదేశించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిన జగద్గురువు శ్రీ శ్రీకృష్ణభగవానుడు 'శ్రీ జగన్నాథ స్వామి' పేరుతో కొలువుదీరి, సంవత్సరానికి ఒకసారి రథం అధిరోహించి ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్న క్షేత్రం - పూరీ. ఈ క్షేత్రంలో జరిగే రథోత్సవం ఎన్నో ప్రత్యేకతలను స్వంతం చేసుకుని విరాజిల్లుతూ ఉంది. పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్ష ద్వితీయనాడు రథోత్సవం జరుగుతుంది.

ఈ రథోత్సవానికి 'మహావేది మహోత్సవం' అని పేరు. సాధారణంగా దాదాపు అన్ని క్షేత్రాలలో బ్రహ్మోత్సవాలలో రథోత్సవంలో ఒకే రథం ఉంటుంది. అందులో ఉత్సవమూర్తులు రథం అధిరోహించి ఊరేగుతారు. అయితే, అందుకు భిన్నంగా పూరీలో మూలమూర్తులైన ముగ్గురు దేవతామూర్తులు వేర్వేరు రథాలలో అంటే మూడు రథాలలో ఊరేగుతారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగ...