భారతదేశం, జూన్ 29 -- ఒడిశా పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుడిచా ఆలయం సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 50మందికిపైగా భక్తులు గాయపడినట్టు తెలుస్తోంది.

ఒడిశా పూరీలో ప్రతియేటా జరిగే జగన్నాథ రథయాత్రను వీక్షించేందుకు లక్షలాది మంది తరలివెళతారన్న విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, శుభద్రలతో కూడిన మూడు భారీ రథాలు జగన్నాథ ఆలయం నుంచి గుడిచా ఆలయానికి వెళతాయి.

కాగా, ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో పవిత్ర రథయాత్ర గుడిచా ఆలయం వద్దకు చేరుకుంటున్నప్పుడు, భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు కిందపడిపోయారు. ఆ వెంటనే పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు ఘటనాస్థలంలోనే మరణించారు. వారిలో ఇద్దరు మహిళలు...