భారతదేశం, మే 24 -- బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబ‌టి ఓ వైపు సినిమాలు చేస్తూనే టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ఇటీవ‌లే తెప్ప‌స‌ముద్రం, వెడ్డింగ్ డైరీస్ సినిమాలు చేసిన అర్జున్ అంబ‌టి తాజాగా మ‌రో వైరెటీ థ్రిల్ల‌ర్ మూవీతో త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

అర్జున్ అంబ‌టి హీరోగా ప‌ర‌మ‌ప‌ద సోపానం పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో అర్జున్ అంబ‌టికి జోడీగా జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పూరి జ‌గ‌న్నాథ్ వ‌ద్ద ప‌లు సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన నాగ శివ....ప‌ర‌మ ప‌ద సోపానం మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

ప‌ర‌మ ప‌ద సోపానం మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. చిన్ని చిన్ని త‌ప్పులేవో అనే ...