భారతదేశం, జనవరి 16 -- విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చింది. ఇవాళ (జనవరి 16) విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్, ఫస్ట్ లుక్ అదిరిపోయాయి. టైటిల్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు పూరి.

హీరోల గెటప్ పూర్తిగా ఛేంజ్ చేసి, కొత్తగా చూపించడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను కొట్టేవాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన చేతిలో పడితే ఎలాంటి హీరో మేకోవర్ అయినా మారాల్సిందే. ఇక సినిమా టైటిల్స్ ను ట్రెండీగా, క్యాచీగా పెట్టడంలోనూ పూరీ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు విజయ్ సేతుపతితో తీస్తున్న సినిమాకు 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే టైటిల్ డిసైడ్ చేశాడు పూరి.

హీరోగా, తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. ఇలా డిఫరెంట్ పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు...