భారతదేశం, జనవరి 19 -- సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు రావడం సహజమే. కానీ ఈ మధ్య హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఒక పాన్ ఇండియా స్టార్ హీరో షూటింగ్ సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో పూజా అతన్ని చెంపదెబ్బ కొట్టిందన్నది ఆ వార్త సారాంశం. అయితే ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా కెరీర్ ఆరంభంలో ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఒక స్టార్ హీరో అనుమతి లేకుండా నా క్యారవాన్‌లోకి వచ్చాడు. నన్ను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించడంతో నేను అతన్ని కొట్టాను" అని చెప్పినట్లుగా కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. దీనికి ఏ వీడియో సాక్ష్యం లేకపోయినప్పటికీ, నెటిజన్లు ఆ హీరో ఎవరై ఉంటారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఈ వార్త పూర్తిగా అవా...