భారతదేశం, మే 3 -- స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు మూడేళ్లుగా కాలం కలిసి రావడం లేదు. వరుసగా ప్లాఫ్‍లు ఎదురవుతున్నాయి. డిజాస్టర్లే పలుకరిస్తున్నాయి. ఎన్నో అంచనాలతో వస్తున్న చిత్రాలు తీవ్రంగా నిరాశను మిగులుస్తున్నాయి. తాజాగా సూర్యతో కలిసి పూజా నటించిన రెట్రో కూడా ప్లాఫ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ బుట్టబొమ్మకు ఇది వరుసగా ఏడో ప్లాఫ్‍గా ఉంది.

పూజా హెగ్డే ప్లాఫ్‍ల పరంపర 2022లో 'రాధేశ్యామ్‍'తో మొదలైంది. ప్రభాస్‍కు జోడీగా ఆ చిత్రంలో పూజా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఆ మూవీ నిరాశపరిచింది. అదే ఏడాది 'ఆచార్య' రూపంలో పూజాగా మరో డిజాస్టర్ ఎదురైంది. ఆ తర్వాత తమిళం, హిందీకే ఈ భామ పరిమితమయ్యారు. అదే ఏడాది దళపతి విజయ్‍ సరసన పూజా హెగ్డే నటించిన తమిళ మూవీ 'బీస్ట్' కూడా డిజాస్టర్ అయింది. పూజా చేసిన హిందీ సినిమా 'సర్కస్' బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడి...