Hyderabad, జూన్ 26 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తుంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జూన్ 25న బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. జూన్ 25 ఉదయం 5:08 గంటలకు పుష్యమి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించాడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని దేవుడు. గురువు, చంద్రుని ప్రభావం కూడా ఈ నక్షత్రం పై ఉంటుంది.

ఈ నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానితో పాటుగా ఇంకా ఎన్నో లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి బుధుని నక్షత్ర సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది? ఎలాంటి లాభాలను వారు పొందుతారు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి పుష్యమి నక్షత్ర సంచారం కలిసి వ...