భారతదేశం, డిసెంబర్ 13 -- ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ పుష్ప 2 చిత్రం రికార్డును బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ క్రియేట్ చేసిన హిస్టరీని ర‌ణ్‌వీర్ సింగ్ తిరగరాశాడు.

దురంధర్ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ మూవీ తాజాగా పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసింది. రెండో శుక్రవారం అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా పుష్ప 2 ఉండేది. మూవీ రిలీజైన తర్వాత వచ్చిన రెండో శుక్రవారం రోజు పుష్ప 2 (హిందీ) రూ.27.50 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు శుక్రవారం (డిసెంబర్ 12) రూ.34.70 కోట్ల కలెక్షన్లతో పుష్ప 2 రికార్డును దురంధర్ బ్రేక్ చేసింది. పుష్ప 2 తర్వాత ఛావా (రూ.24.30 కోట్లు), యానిమల్ (రూ.23.53 కోట్లు) ఉన్నాయి.

దురంధర...