Hyderabad, సెప్టెంబర్ 25 -- ఓజీ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. రిలీజ్ కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే అత్యధిక వసూళ్ల రికార్డును తిరగరాయడం విశేషం. పవన్ కల్యాణ్ దెబ్బకు అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డు బ్రేకయింది. తొలి రోజు వసూళ్లు అయితే ఏకంగా రూ.150 కోట్ల మార్క్ అందుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.

పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 25) రిలీజైంది. అయితే ఒక రోజు ముందే అంటే బుధవారం తెలుగు రాష్ట్రాలతోపాటు ఇండియా వ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. వీటి ద్వారా ఏకంగా రూ.23 కోట్లు రావడం విశేషం. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ మూవీకి సాధ్యం కాని రికార్డు ఇది.

ఈ క్రమంలో పుష్ప 2, స్త్రీ 2లాంటి సినిమాల రికార్డులను ఓజీ బ్రేక్ చేసింది. ఏపీ, తెలంగాణల్లో పెయిడ్ ...