Hyderabad, ఏప్రిల్ 24 -- అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సినిమా పుష్ప 2కు థియేటర్లు, ఓటీటీలో వచ్చినంత రెస్పాన్స్ టీవీ ప్రీమియర్ కు రాలేదు. పుష్ప 2 మూవీ ఏప్రిల్ 13న స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఊహించినంత టీఆర్పీ రేటింగ్ మాత్రం రాకపోవడం గమనార్హం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో చరిత్ర సృష్టించిన విషయం తెలుసు కదా. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకుపైగా వసూలు చేసింది. తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ దూసుకెళ్లింది. ఈ ఏప్రిల్ 13న స్టార్ మాలో టీవీ ప్రీమియర్ అయింది. దీనికి 12.61 టీఆర్పీ రేటింగ్ మాత్రమే నమోదైంది. ఇది కాస్త తక్కువే అని చెప్పాలి. కానీ రెండంకెల రేటింగ్ అందుకోవడం కాస్త ఊరట కలిగించే విషయం. పుష్ప 1 మూవీకి 22.54 రేటింగ్ వచ్చింది. దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువే.

నిజానికి ఆ రోజు అదే సమయానికి జీ తె...