భారతదేశం, మే 12 -- డ్రాగన్ చిత్రంతో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు. డైరెక్టర్ నుంచి హీరోగా మారిన ఇతడికి తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో ప్రదీప్‍తో ఓ మూవీని అనౌన్స్ చేసింది తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప 2తో గతేడాది భారీ సక్సెస్ కొట్టింది ఆ బ్యానర్. గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రదీప్ రంగనాథన్‍తో మూవీతో తమిళంలో రెండో ప్రాజెక్ట్ చేస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాకు 'డ్యూడ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో చిక్కులు ఏర్పడ్డాయి.

డ్యూడ్ సినిమా టైటిల్ తమదేనని, దీన్ని సంవత్సరం కిందటే రిజిస్టర్ చేశామని యంగ్ హీరో, దర్శకుడు తేజ్ చెప్పారు. ప్రదీప్ - మైత్రీ కాంబినేషన్ చిత్రానికి ఆ టైటిల్ చూసి ఆవేదన కలిగిందని అన్నారు. తాము సంవత్సరంగా ...