Hyderabad, మే 27 -- మాస్.. ఇప్పుడు, ఎప్పుడూ ఓ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ కు వీళ్లే కారణం. ఈ మాస్ జనం ఈలలు, గోలలు లేకపోతే థియేటర్లు బోసిపోతాయి. ముఖ్యంగా పుష్పలాంటి మాస్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే దానికి కారణం ఈ మాసే. కానీ వాళ్లు మాస్ మగాళ్లు కాదు.. ఎర్రి పుష్పాలే అనేలా అల్లు అర్జున్ పుష్ప మూవీపై సీనియర్ జర్నలిస్ట్ రాజు రాసిన ఓ డిఫరెంట్ రివ్యూ ఇక్కడ చదవండి.

''పుష్ప అంటే పువ్వనుకుంటివా? కాదు... ఫైరు...'' - ఆ సినిమాలో హీరో తన పేరు గురించి తన గురించి తానే స్వయంగా చెప్పుకునే ఓ 'పంచ్ డైలాగ్' ఇది. ఇది కోట్ల మంది గుండెల్లో అను నిత్యం మార్మోగే డైలాగ్. ఈ లోకంలో ప్రతి ఒక్కడిదీ ఇదే తపన.. 'నేను పువ్వుని కాదు.. నేను ఫైరుని' అని చాటి చెప్పుకోవాలనే తపన. ఆ హీరోలాగా నేను కూడా 'తగ్గేదే లా' అని స్టయిల్ గా డైలాగ్ కొట్టి ఎదుటివాడిని బిత్తరపోయేలా...