HYderabad, ఏప్రిల్ 20 -- సరదాగా సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లి ఉల్లి మిక్చర్ తినే అలవాటు మీకుందా..? అయితే అన్ని వేళలా మీకు నచ్చినట్లుగా ఉల్లి మిక్చర్ ఉండకపోవచ్చు. లేదా కొన్ని ప్రదేశాలలో ఉల్లి మిక్చర్ అందుబాటులోనూ లేకపోవచ్చు. కానీ, అదే ఉల్లి మిక్చర్ ను ఇంట్లో రెడీ చేసుకోవడం మీకూ వస్తే ఇంకా హ్యాపీ కదా. కావాల్సినప్పుడల్లా మిక్చర్ రెడీ చేసుకుని తినేయొచ్చు.

ఉల్లి మిక్చర్ తినడం వల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది ఆకలితో ఉండే సమయంలో త్వరగా తినేందుకు సిద్ధంగా ఉండే స్నాక్. ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పల్లీలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల వనరు. ఇవి శక్తిని అందిస్తాయి. నరాలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. శాకాహారులకు ...