Andhrapradesh,kadapa, ఆగస్టు 7 -- పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై దాడి జరిగింది. వీరి వాహనాన్ని కారుతో ఢీకొట్టి, రాళ్లతో దాడి చేశారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు.

ఆగస్ట్ 12న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో పార్టీ విజయం కోసం వైసీపీ, టీడీపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు మరికొందరిపై దాడి జరిగింది.

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వరుస ఘటనల నేపథ్యంలో...