భారతదేశం, జనవరి 2 -- వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్. ఇటీవల నయనం సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌తోపాటు ఆయన భార్య, బిగ్ బాస్ బ్యూటి వితికా షెరు కూడా యాక్ట్ చేసింది.

ఆ సినిమానే ధర్మస్థల నియోజకవర్గం. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ధర్మస్థల నియోజకవర్గం మూవీలో వరుణ్ సందేశ్, వితికా షెరుతోపాటు సీనియర్ నటులు సుమన్, సాయి కుమార్, నటరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ధర్మస్థల నియోజకవర్గం సినిమాకు జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. మేరు భాస్కర్ నిర్మించిన ఈ సినిమా పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న...