భారతదేశం, జూలై 11 -- ఆఫీసు డెడ్‌లైన్లు, కుటుంబ బాధ్యతలు, ఫిట్‌నెస్ లక్ష్యాలు... ఇలా ఎన్నో సమస్యలు పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎంత చేసినా విశ్రాంతి తీసుకోవడానికి తీరిక లేకుండా పోతోంది. ఆరోగ్యం గురించి చాలా చర్చ జరుగుతున్నా, పురుషులు లోలోపల బాధపడుతున్న దీర్ఘకాలిక ఒత్తిడి, తక్కువ స్టామినా, అలసట, టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోవడం లాంటి సమస్యలను చాలా మంది పట్టించుకోవడం లేదు.

ఈ విషయమై కపివా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ గోవిందరాజన్ HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడారు. "ఈ ఫాస్ట్‌ఫుడ్ యుగంలో, వేగవంతమైన పనులు, డిజిటల్ ప్రపంచం.. ఇలాంటి వాటి మధ్య మనకు కేవలం ప్రొటీన్ షేక్‌లు, ఎనర్జీ షాట్‌లు సరిపోవు. దీర్ఘకాలం పాటు మనల్ని నిలబెట్టే పరిష్కారాలు కావాలి. మన భారతదేశపు 5,000 సంవత్సరాల పురాతన జీవన శాస్త్రం ఆయుర్వేదం అలాంటి సమగ్ర, నివారణ మార్గాన్ని అంది...