Hyderabad, మే 6 -- ఎప్పుడైనా ఒక కొత్త రుచిని ప్రయత్నించాలని అనిపించిందా? మీ నాలుకకు సరికొత్త అనుభూతిని అందించే ప్రత్యేకమైన పచ్చడి కోసం మీరు వెదుకుతుంటే అది ఈ పుదీనా కొబ్బరి పచ్చడే! వినడానికి కొంచెం కొత్తగా అనిపించినా, ఈ కాంబినేషన్ అద్భుతమైన రుచిని అందిస్తుంది. పుదీనాలో ఉండే తాజా సువాసన, కొబ్బరిలో ఉండే తియ్యని రుచి కలిసి మీ భోజనానికి ఒక ప్రత్యేకమైన మెరుపును తీసుకొస్తాయి. రోటీ, దోస, ఇడ్లీ లేదా వేడి అన్నంతో కలిపి తిన్నారంటే ఈ పచ్చడి రుచి మరిచిపోలేరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే ఆ రుచి అద్భుతం. తిన్నవాళ్లెవరైనా ఆహా అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఈసారి మీ రుచిని కొత్త దారిలో నడిపించండి!

పుదీనా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కొబ్బరిలోని పోషకాలు తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ పచ్చడి ప్రత్యేకమైన రుచితో పాటు ఆకలిని పెంచుతు...