భారతదేశం, ఆగస్టు 16 -- అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం కీలక అంశంగా ఈ సమావేశం సాగినప్పటికీ.. ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ ట్రంప్ భేటీ అయ్యేందుకు చూస్తున్నారు. ఇక రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంతో ట్రంప్ తన కోపాన్ని సుంకాల రూపంలో చూపించారు. ఏకంగా 50 శాతానికి టారిఫ్ పెంచుతున్నట్టుగా ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్ ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి.

పుతిన్‌తో రెండున్నర గంటల భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడారు. సమావేశం సానుకూలంగా జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా టారిఫ్స్ గురించి కూడా ట్రంప్ కామెంట్స్ చేశారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాల గురించి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలని లేదన్నారు. రెండు, మూడు వారాల్లో పునర...