భారతదేశం, నవంబర్ 24 -- శ్రీశైలంలో ఆదివారం నాడు భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఏపీ టూరిజం హరిత హోటల్ శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్ మోసగాళ్లు గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారని సమాచారం. భక్తులను నిలువునా మోసం చేస్తున్నారని తెలుస్తోంది. దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని కేటుగాళ్లు చెబుతున్నారు. తాజాగా ఓ ఘటనలో వెలుగులోకి వచ్చింది.

బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు శ్రీశైలం దేవస్థానం దర్శనం కోసం వస్తున్నానని, అందుకోసం ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. నకిలీ వెబ్‌సైట్ ద్వారా దాని ఆపరేటర్‌తో ఫోన్‌లో మాట్లాడి గదిని బుక్ చేశాడు. ఫోన్ పే ద్వారా రూ.15,950 చెల్లించి బుకింగ్ రసీదు కూడా పొందాడు. అది సరైనదేనని భావించి, ఆదివారం శ్రీశైలం చేరుకున్నాడు.

హరిత హోటల్ వద్దకు వెళ్ళి రసీదు చూపించాడు. కానీ అది నకిలీదని, అధికారిక ఏపీ టూర...