భారతదేశం, నవంబర్ 19 -- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి శత జయంత్యుత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జయంతి సందర్బంగా, రైతులకు అందించే గోదాన కార్యక్రమం లోభాగంగా నలుగురు రైతులకు గోదానం చేశారు. ప్రధాని మోదీకి ఆలయ పూజారులు వేద ఆశీస్సులు ఇచ్చారు.

ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ముందు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ప్రధానమంత్రి మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.

పుట్టపర్తిలో నిర్వహి...