Hyderabad, అక్టోబర్ 6 -- సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత వారం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారని అతని టీమ్ ధృవీకరించింది. ఈ జంట తమ సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ గురించి పోస్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు నిశ్చితార్థం తర్వాత విజయ్ తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించాడు.

రష్మిక మందన్నాతో ఎంగేజ్‌మెంట్ తర్వాత విజయ్ దేవరకొండ ఆదివారం (అక్టోబర్ 5) పుట్టపర్తి వెళ్లాడు. అతని పీఆర్ఓ తన సోషల్ మీడియాలో పుట్టపర్తి సందర్శనకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. "దివ్య ఆశీస్సుల కోసం విజయ్ దేవరకొండ.. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని పుట్టపర్తిలో సందర్శించాడు" అని రాశారు.

ఈ వీడియోలో నటుడితో పాటు అతని సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ, తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి ఉన్...