భారతదేశం, నవంబర్ 26 -- కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు 305 పరిశ్రమలను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు(TGPCB) ఆదేశించింది. పర్యావరణ చట్టాల అమలును బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతమైన కాలుష్య నియంత్రణను నిర్ధారించడం ఈ చర్య లక్ష్యంగా తెలుస్తోంది

కాలుష్య తీవ్రత ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్‌గా వర్గీకరిస్తుందని TGPCB అధికారులు తెలిపారు. ఈ కేటగిరీల కింద తెలంగాణలో మొత్తం 12,264 పరిశ్రమలు ఉన్నాయి. ఈ వర్గీకరణకు అనుగుణంగా TGPCB కొత్త, ఇప్పటికే ఉన్న పారిశ్రామిక యూనిట్లను నిశితంగా పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు.

జనవరి 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య బోర్డు 2,620 కొత్త కంపెనీల స్థాపనకు అనుమతులు మంజూరు చేసింది. వాయు, నీటి కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉన...