భారతదేశం, జూలై 11 -- సయామీ ఖేర్ గుర్తున్నారు కదా. బాలీవుడ్ నటి. తెలుగులోనూ రేయ్, వైల్డ్ డాగ్, హైవే వంటి మూవీల్లో నటించారు. బాలీవుడ్ మెరుపులకు, సోషల్ మీడియా హడావుడికి దూరంగా సయామీ ఖేర్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఏడాది వ్యవధిలో రెండుసార్లు కఠినమైన ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయథ్లాన్‌ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా నిలిచారు. ఈసారి ఆమె పీరియడ్స్‌లో ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించారు. ఇది ఆమెకు మరింత సవాలుగా మారింది. కఠినమైన భూభాగం, కఠోర వాతావరణ పరిస్థితులకు పీరియడ్స్ అదనపు ఇబ్బందిని తెచ్చిపెట్టాయి.

తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందని, దీనివల్ల రుతుక్రమం క్రమరహితంగా ఉంటుందని సయామీ వెల్లడించారు. అయితే, "సెల్ఫ్-టాక్" (తనతో తాను మాట్లాడుకోవడం) తనను ముందుకు నడిపించడంలో ఎంతో సహాయపడిందని ఆమె చెప్పారు.

"ఈ ఏడాది ఒక అదనపు సవాలు ఎ...