భారతదేశం, ఆగస్టు 21 -- నిజంగా ఇది గుండెల్ని కలిచివేసే సంఘటన. వైద్యులు, ప్రజలు తప్పకుండా తెలుసుకోవాల్సిన, ఎప్పటికీ మర్చిపోకూడని అత్యంత విషాదకరమైన ఘటన. మెడికల్ అత్యవసర పరిస్థితుల్లో జాప్యం ఎంతటి వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందో డాక్టర్ వివేకానంద్ వివరించారు. రీబూటింగ్ ది బ్రెయిన్ పాడ్‌కాస్ట్ ఆగస్టు 14 ఎపిసోడ్‌లో వాస్కులర్ సర్జన్ అయిన డాక్టర్ వివేకానంద్ న్యూరోసర్జన్ డాక్టర్ శరణ్ శ్రీనివాసన్‌తో కలిసి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనే నిశ్శబ్ద ప్రమాదం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన 18 ఏళ్ల అమ్మాయి విషాద గాథను గుర్తు చేసుకున్నారు. కాలు నొప్పి, వాపుతో ఆసుపత్రికి వచ్చిన ఆ అమ్మాయి, చివరికి ఎలా చనిపోయిందో చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక మతపరమైన కార్యక్రమం కోసం తన పీరియడ్స్‌ను ఆలస్యం చేయడానికి హార్మోనల్ మాత్రలు తీసుకున్న 18 ఏళ్ల యువతి...