భారతదేశం, జూన్ 3 -- యూకేకు చెందిన ఎన్‌హెచ్‌ఎస్ సర్జన్ డాక్టర్ కరణ్ రాజన్ ఒక మహిళ అడిగిన ప్రశ్నకు జూన్ 2న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో స్పందించారు. "నాకు పీరియడ్స్ సమయంలో ఎందుకు ఎక్కువసార్లు మలవిసర్జన అవుతుంది?" అని ప్రశ్నించిన కంటెంట్ క్రియేటర్ నాద్యా ఒకామోటోకు బదులిస్తూ, ఋతు చక్రం (పీరియడ్స్) సమయంలో మహిళలు తరచుగా మల విసర్జనలో మార్పులను ఎలా అనుభవిస్తారో ఆయన వివరించారు.

డాక్టర్ రాజన్ వీడియోలో మాట్లాడుతూ, "చాలా మంచి ప్రశ్న. పీరియడ్స్ సమయంలో మీకు మలవిసర్జన ఎక్కువగా అవ్వడానికి వాస్తవానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే.. పీరియడ్ హార్మోన్లు మీ శరీరం నీటిని పీల్చుకోవడాన్ని కష్టతరం చేస్తాయి. కాబట్టి, మలం పల్చగా, మెత్తగా అయ్యే అవకాశాలు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని వివరించారు.

"రెండవ కారణం ప్రొస్టాగ్లాండిన...