Hyderabad, ఏప్రిల్ 24 -- చాలా మంది స్త్రీలకు రుతుస్రావం సమయంలో ఎన్నో సమస్యలు వస్తాయి. పొత్తికడుపు నొప్పి, రొమ్ము, వెన్నునొప్పి వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.ఈ నెలసరి నొప్పి కొన్నిసార్లు కాళ్ల వరకు వ్యాపిస్తుంది. రుతుస్రావం సమయంలో హార్మోన్లలో విపరీతమైన మార్పుల వల్ల స్త్రీలకు కాలు నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

అయితే కాళ్ల నొప్పులు భరించలేనంతగా మారుతుంటే అది కూడా మీకు ఆరోగ్య సమస్య ఉందనడానికి సంకేతం కావచ్చు. నెలసరి సమయంలో కాళ్ల నొప్పులను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

రుతుచక్రం సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ స్రవించే రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రోస్టాగ్లాండిన్ గర్భాశయంలోని కండరాలపై పనిచేస్తుంది. ప్రోస్టాగ్లాండిన్లు గర్భాశయ సంకోచాలకు, ఎండోమెట్రియంను బయటకు పంపడానికి సహాయపడతాయి. ప్రోస్టాగ్లాండిన్ శరీరంలో మంటను కలిగిస్తుంది. దీనివల్ల వీపు, ...