Hyderabad, మార్చి 6 -- అండాశయ క్యాన్సర్ మహిళలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. ఇది అండాశయాలు, ఫాలోపియన్ ట్యూబ్‌లు లేదా పొట్టలోని పొరలో అభివృద్ధి చెందుతుంది. దీని వల్ల పొట్ట నొప్పి, యోని నుంచి రక్తస్రావం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, ఆకలిలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అండాశయ క్యాన్సర్ లక్షణాల స్వభావం అస్పష్టంగా ఉండటం వల్ల వైద్య సహాయం ఆలస్యం కావచ్చు. ఇది సమస్యలకు దారితీస్తుంది. అండాశయ క్యాన్సర్‌ను తరచుగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పి. డి. హిందూజా ఆసుపత్రి & ఎంఆర్‌సి, మహిమ్‌లోని గైనకాలజికల్ క్యాన్సర్ నిపుణురాలు డాక్టర్ సంపద దేశాయి ఈ క్యాన్సర్ కు సంబంధించి ఎన్నో అంశాలను షేర్ చేశారు.

"అండాశయ క్యాన్సర్ గురించి అవగాహన పెరుగుతున్నందున, చాలా మంది మహిళలు ఒక నెల రు...