భారతదేశం, జనవరి 12 -- టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన మలయాళ ముద్దుగుమ్మ పార్వతి తిరువోతు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటనతోనే కాకుండా, తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే వ్యక్తిత్వంతో పార్వతి వార్తల్లో నిలుస్తుంటారు.

తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న పార్వతి తిరువోతు స్టార్ హీరో ధనుష్ సరసన నటించిన సూపర్ హిట్ చిత్రం 'మరియన్' షూటింగ్ సమయంలో ఎదురైన ఒక ఇబ్బందికరమైన సంఘటనను పంచుకున్నారు.

2013లో భరత్ బాలా దర్శకత్వంలో వచ్చిన 'మరియన్' చిత్ర షూటింగ్ తొలిరోజు అనుభవం పార్వతికి అస్సలు కలిసి రాలేదు. ఆ రోజు కథ ప్రకారం హీరోయిన్ పూర్తిగా నీళ్లలో తడవాలి, హీరోతో రొమాంటిక్ సీన్ చేయాలి.

"షూటింగ్ మొదలైన మొదటి రోజే నేను పీరియడ్స్‌లో ఉన్నాను. అక్కడ నాపై గంటల తరబడి నీళ్లు కుమ్మరిస్తూనే ఉన్నారు. ...