భారతదేశం, అక్టోబర్ 31 -- తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఈ రెండేళ్ల పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ఓటరు మనసులో ఏముందో తెలుసుకోవడానికి నెల రోజుల పాటు(25 సెప్టెంబర్‌ నుండి 25 అక్టోబర్‌ వరకు) తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి పీపుల్స్‌ పల్స్‌ సంస్థ మూడ్‌ సర్వే నిర్వహించింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ రెండేళ్లలో వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో తీసుకున్న విధానాలు ఏంటి? హామీ ఇచ్చినట్టుగా ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయా? ఈ రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఎంతవరకు ప్రజల మన్ననలు పొందాయి? తదితర అంశాలను క్లుప్...