భారతదేశం, సెప్టెంబర్ 7 -- రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ - 2025 ఫలితాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. రేపు(సెప్టెంబర్ 08) అన్ని సబ్జెక్టుల ఫలితాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా పీజీ కోర్సుల్లో(ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ) అడ్మిషన్లు కల్పిస్తారు.

ఈసారి జరిగిన సీపీగెట్ పరీక్షల కోసం మొత్తం 45,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కూడా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం ఫలితాలు అందుబాటులోకి వచ్చాక. ర్యాంక్ కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆగస్టు 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు జరిగాయి. ప్రతి రోజూ 3 సెషన్ల్లలో నిర్వహించారు. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగాయి. ఉస్మానియా యూనివర్శిటీ, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు...