భారతదేశం, మే 11 -- భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాక్ దుస్సాహసానికి దీటుగా బదులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సాయుధ దళాలను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనలో కొత్త పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించాయి. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, పాకిస్థాన్ కాల్పులు జరిపితే.. మేం కూడా జరుపుతామని సమావేశంలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

కశ్మీర్ విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉందని కూడా ఈ సందర్భంగా భారత్ తెలియజేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) తిరిగి రావడమనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని స్పష్టం చేసింది. ఉగ్రవాదుల అప్పగింతపై వాళ్లు మాట్లాడితే మేం మాట్లాడుతామని, మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం లేదని భారత్ పేర్కొంది. ఇందులో ఎవ...