భారతదేశం, ఏప్రిల్ 22 -- కూటమి ప్రభుత్వ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సూట్‌కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని.. కోట్లాది రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి దృష్టిని మళ్ళించేందుకే ఈ అరెస్ట్‌ల డ్రామాకు తెరతీశారని ఫైర్ అయ్యారు.

'ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్‌లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయుల...