భారతదేశం, ఆగస్టు 1 -- న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఎండీ, సీఈఓ గిరీష్ కౌస్గీ రాజీనామా చేయడంతో ఆ కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఈ షేర్ ధర ఏకంగా 15% పతనమై లోయర్ ప్రైస్ బ్యాండ్‌ను తాకింది. ఆయన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయడంతో మార్కెట్‌లో ఆందోళన నెలకొంది.

ఈ రోజు ఉదయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, కౌస్గీ తన పదవికి రాజీనామా చేశారని, ఆయన రాజీనామా అక్టోబర్ 28, 2025 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. గిరీష్ కౌస్గీ నాలుగేళ్ల కాలానికి అక్టోబర్ 2022లో ఈ సంస్థలో చేరారు.

కౌస్గీ నిర్మించిన బలమైన పునాది ఆధారంగా కంపెనీ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, వ్యాపార లక్ష్యాలు, వృద్ధి పథం అలాగే కొనసాగుతాయని కంపెనీ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. "కంపెనీ అద్భుతమైన పనితీరు కనబరచడంలో కీలకంగా వ్యవహ...