భారతదేశం, ఆగస్టు 2 -- గత కొన్ని రోజులుగా దేశంలోని కోట్ల మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదల అయ్యాయి. ఆగస్టు 2న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు మోదీ. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున చేరాయి. రైతుల ఖాతాల్లోకి రూ.20,500 కోట్లను ప్రభుత్వం బదిలీ చేసింది.

వారణాసిలో పలు శంకుస్థాపన పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు 2200 కోట్ల విలువైన ప్రాజెక్టులను మెుదలుపెట్టారు. ఇదే సమయంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత డబ్బును రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి కొన్ని నియమాలను రూపొందించింది. ఇందులో రైతులు ఆధార్ కార్డును వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం, ఈ కేవైసీ...