భారతదేశం, ఏప్రిల్ 27 -- ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేలు మూడు విడతల్లో అందిస్తుంది. 2018 డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకూ 19 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించారు. మరికొన్ని రోజుల్లో పీఎం కిసాన్ 20వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

పీఎం కిసాన్ 20వ విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంది. ముందు రైతుల బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింక్ చేయాలి. దీంతో పాటు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకుని 11 అంకెల నెంబర్ పొందాలి. ఆపై ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాల్లో నగదు పడనుంది.

పీఎం కిసాన్ నిధులను ప్రతీ ఏటా మూడు విడతల్లో విడుదల చేస్తారు. అంటే 4 నెలల వ్యవధిలో పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేస్తారు. 18వ వ...