భారతదేశం, జూలై 13 -- జీ5 ఓటీటీలో హిందీ సినిమా కాళీధర్ లాపాట ట్రెండింగ్ లో కొనసాగుతోంది. డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. జూలై 4న ఈ ఫిల్మ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జీ5 స్పెషల్ సినిమాగా రూపొందిన ఈ హిందీ సినిమా ప్రస్తుతం ఈ ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

మిడిల్ ఏజ్ లో ఉన్న కాళీధర్ కు మతిమరుపు. అతణ్ని కుటుంబ సభ్యులు వదిలేసుకుంటారు. అక్కడి నుంచి ఎనిమిదేళ్ల అనాథతో కలిసి అతను ప్రయాణం సాగిస్తాడు. కాళీధర్ కోరికలు తీర్చేందుకు ఈ జంట ఇండియా మొత్తం చుట్టేస్తుంది. అదే సమయంలో ఆస్తి కోసం కాళీధర్ తో సంతకాలు పెట్టించుకోవాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుంటారు. కాళీధర్ జర్నీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో ఈ మూవీ సాగుతుంది. ఐఎండీబీలో ఈ మూవీకి 8.2 రేటింగ్ ఉంది.

కాళీధర్ లాపాటలో కాళీధర్ గా...