Hyderabad, ఏప్రిల్ 21 -- పిల్లలు శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ, దీని కోసం మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆలోచించారా..? కొన్ని పనులు చిన్నతనం నుంచి అలవాటు చేస్తేనే వారి భవిష్యత్ వెలిగిపోతుంది. పిల్లల మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఉదయం వారి దినచర్యలో కొన్ని పనులు చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు ఇది మరింత ముఖ్యమైన విషయం.

నిజానికి ఉదయం సమయం చాలా ప్రొడక్టివిటీతో కూడి ఉంటుంది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూడవచ్చు. అందుకే పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడే కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు చూద్దాం.

రోజులో ఉదయం సమయం మొత్తం రోజును ప్రభావితం చేస్తుంది కాబట్టి, పిల్లలకు వారి రోజును ప్రేమతో ప్రారంభమయ్యేలా చూసుకోండి. దీని కోసం వెంటనే పిల్లలను పడక నుండి లేవనీయకండి. లేపడానికి బ...