భారతదేశం, నవంబర్ 8 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ ఫిల్మ్ 'బారాముల్లా'. ఈ మూవీ గురువారం (నవంబర్ 7) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా బారాముల్లా తెరకెక్కింది. ఈ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ఈ మూవీ స్టోరీ, రివ్యూపై ఓ లుక్కేయండి.

డీఎస్పీ రిద్వాన్ సయ్యద్ (మానవ్ కౌల్) తన భార్య గుల్నార్ (భాషా సుంబ్లి), ఇద్దరు పిల్లలతో కలిసి కాశ్మీర్‌లోని ఒక కొత్త బంగ్లాకు మారడంతో కథ మొదలవుతుంది. కానీ వారి ప్రశాంతత ఎక్కువ కాలం నిలవదు. లోయ వ్యాప్తంగా పిల్లలు ఎలాంటి కారణం లేకుండా అదృశ్యమవుతూ ఉంటారు. రిద్వాన్ దర్యాప్తు లోతుగా సాగుతున్న కొద్దీ, అతని ఇంట్లోనే వింత సంఘటనలు జరగడం మొదలవుతుంది.

కాశ్మీర్ లోయలో పిల్లల మిస్సింగ్ కలకలం రేపుతోంది. అదే సమయంలో సూపర్ నేచురల్ సంఘటనలు జరగడం ...